మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:07 IST)

అన్నయ్య, పవన్‌కు మధ్యలో త్రిష.. ఫోటోలు వైరల్

Trisha Krishnan
Trisha Krishnan
టాలీవుడ్ స్టాలిన్ మూవీ తర్వాత చాలా యేళ్లకు త్రిష.. మరోసారి చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్నం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. మరోవైపు త్రిష.. పవన్ కళ్యాణ్ సరసన 'తీన్‌మార్' మూవీలో జోడిగా నటించింది. అంతకు ముందు బంగారం సినిమాలో కాసేపు అలా మెరిసింది.
 
త్రిష విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తరుణ్ హీరోగా నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో దాదాపు సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా  అందరి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. 
Trisha
Trisha
 
ఈ నేపథ్యంలో హైదారాబాద్‌లో ప్రత్యకంగా వేసిన 'విశ్వంభర' షూటింగ్ సెట్‌లో అన్నయ్యను మరో అన్నయ్య నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రిష, యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.