శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (13:20 IST)

చిన్మయి మళ్లీ సంచలన వ్యాఖ్యలు... నటి అర్చనకు హితవు

Chinmayi
ప్రముఖ సింగర్ చిన్మయి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ యువనటి అర్చనకు ఆమె హితవు పలికింది. ఇటీవల వైరముత్తును అర్చన కలిసింది. ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 
గొప్ప రచయిత వైరముత్తును కలిశానని.. ఎంతో సంతోషంగా వుందని తెలిపింది. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. ఇలాగే కథ మొదలవుతుందని.. ఆయనతో జాగ్రత్తగా వుండాలని అర్చనకు సూచించింది. వీలైనంత వరకు ఆయన దూరంగా వుండాలని..  తన పక్కన వేరే వ్యక్తులు లేకుండా ఒక్కదానివే వెళ్లి ఆయనను ఎప్పటికీ కలవద్దని చెప్పింది. 
 
విదేశాలలో ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు వైరముత్తు తనను వేధింపులకు గురి చేశాడని మీటూ వేదికగా చిన్మయి గతంలో ఆరోపించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో అర్చనకు చిన్మయి హితవు పలికింది. తొలుత ఆయన మంచి వ్యక్తిగానే కనిపిస్తారని.. ఆ తర్వాత అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తారని.. ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారు.