ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (08:49 IST)

దీపికా పదుకునే దుస్తులు.. స్త్రీలకు ఆ హక్కు లేదా... దివ్య స్పందన

deepika padukone
పఠాన్ సినిమాలో నటి దీపికా పదుకునే దుస్తులపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకుణె అసభ్యకరమైన కాషాయ దుస్తులు ధరించి సంచలనం రేపింది. కాషాయ రంగులో బికీని ధరించి వివాదానికి కారణమైంది.  దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కాషాయ రంగును అలా వాడటం సరికాదని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిపై దీపికకు పలువురు మద్దతు పలుకుతున్నారు. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, నటి దివ్య ఈ వ్యవహారంపై తన ట్విట్టర్ పేజీలో తెలిపింది.
 
సమంత విడాకుల గురించి, సాయి పల్లవి కామెంట్ గురించి, రష్మిక విడిపోవడం గురించి, దీపికా డ్రెస్ గురించి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దేనినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళల ప్రాథమిక హక్కు. స్త్రీలు దుర్గాదేవి స్వరూపాలు.  స్త్రీ ద్వేషం ఒక దుర్మార్గం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని దివ్య పిలుపునిచ్చింది.