మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:09 IST)

బాలికకు ముద్దుపెట్టిన గాయకుడు.. వీడియో వైరల్

ప్ర‌ముఖ సింగర్, కంపోజ‌ర్ పాప‌న్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. రియాలిటీ షోలో భాగంగా ఓ మైన‌ర్ బాలిక పెదాల‌పై ముద్దుపెట్టినందుకు అత‌నిపై సుప్రీం కోర్టు లాయ‌ర్ రుణా భుయాన్ కేసు పెట్టారు.

ప్ర‌ముఖ సింగర్, కంపోజ‌ర్ పాప‌న్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. రియాలిటీ షోలో భాగంగా ఓ మైన‌ర్ బాలిక పెదాల‌పై ముద్దుపెట్టినందుకు అత‌నిపై సుప్రీం కోర్టు లాయ‌ర్ రుణా భుయాన్ కేసు పెట్టారు. ప్ర‌ముఖ గాయ‌కులు హిమేశ్ రేష్మియా, షాన్‌తో క‌లిసి పాప‌న్ ఓ మ్యూజిక్ రియాలిటీ షోకు న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో హోలీ సంబ‌రాల్లో భాగంగా పాప‌న్ ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌కు రంగు పూసి ఆ త‌ర్వాత ఆమె పెదాల‌పై ముద్దు పెట్టాడు. దీంతో ఆ బాలిక కూడా షాక్ అయింది. ఈ వీడియో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గామారింది. పాప‌న్ వ్య‌వ‌హార శైలి అభ్యంత‌ర‌కరంగా ఉండ‌డంతో సుప్రీం కోర్టు న్యాయ‌వాది రుణా భుయాన్ జాతీయ బాల‌ల హ‌క్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.