గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (15:43 IST)

ఆ హీరోయిన్లు అన్నీ చూపిస్తున్నారని వీళ్లు కూడా చూపిస్తే ఎలా? బాలు ఘాటు వ్యాఖ్యలు

తిరుపతి జరిగిన ఒక ప్రోగ్రామ్‌కు హాజరైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఎప్పట్లాగే వివిధ అంశాలపై ప్రసంగించారు. కాకపోతే ఈసారి చాలా ఘాటుగా సినీ పరిశ్రమ, హీరోయిన్లు మరియు రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగువారికి భాషాభిమానం తక్కువని, కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో వాడే భాష వింటే ప్రాణం పోతుందని చెప్పారు.
 
ఆడియో ఫంక్షన్లు, ఏవైనా ఈవెంట్‌లకు హీరోయిన్లు వేసుకొచ్చే దుస్తులు చూస్తే చిర్రెత్తుకొస్తుందనీ, పొట్టి దుస్తులు వేసుకుంటేనే నిర్మాతలు, డైరెక్టర్‌లు సినీ ఛాన్సులు ఇస్తారని వాళ్ల భావనేమో, ఇంకా ఏమైనా చెప్తే ఇంగ్లీష్ సినిమాలలో ఇవి సాధారణమే కదా అంటారు. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి మారాలి. వాళ్ల సంప్రదాయం వేరు, మన సంప్రదాయం వేరు.. వాళ్లు చూపిస్తున్నారు కదా అని మనము కూడా అన్నీ చూపించలేము కదా, అని పేర్కొన్నారు బాలు. ఇక నిర్మాతలు కూడా టాలెంట్‌ను బట్టి కాకుండా దేహ ప్రదర్శన చేసే వారికి, పరభాషా హీరోయిన్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని మండిపడ్డారు.
 
రాజకీయాల గురించి చెప్పాల్సిన పనే లేదు, పరిస్థితి ఎంతగా దిగజారిందంటే హత్యలు చేసి జైలుకు వెళ్లొచ్చిన ప్రబుద్ధులే రాజకీయాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచి కూడా పోటీ చేసి గెలుస్తున్నారు. ఒకవేళ నేరం రుజువై శిక్ష పడితే బయటకు వచ్చాక అరెస్టు చేసిన వారితోనే సెల్యూట్ చేయించుకుంటున్నారని వాపోయారు. మొత్తానికి తియ్యటి సంగీతం పలికే బాలు నోటి వెంట ఘాటైన మాటలే వచ్చాయి. ఇవి దేనికి దారి తీస్తాయో చూడాలి.