బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (15:52 IST)

సింగర్ సునీత కుమార్తె ఫోటోలు నెట్టింట వైరల్.. హీరోయిన్స్‌కు పోటీగా..?

Sunitha
సింగర్ సునీత స్టార్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా ప్రస్థానం. 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్‌గా మారిన సునీత 19 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ ప్రాయంలో పెళ్లి చేసుకున్న ఆమె ఓ అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చారు.
 
జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో భర్తతో విబేధాలు తలెత్తాయి. విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో పేరెంట్స్ వద్దకు వచ్చేశారు. అన్నింటినీ ఎదిరించి నిలిచిన సునీత ప్రస్తుతం హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త , మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకున్నారు.  
 
రామ్-సునీత వివాహం పిల్లలు ఆకాష్, శ్రేయ దగ్గరుండి నిర్వహించారు. రామ్‌తో వివాహం తర్వాత సునీత జీవితం మారిపోయింది. ఆమె ఆనందకర జీవితం అనుభవిస్తున్నారు. కెరీర్‌లో కూడా బిజీ అయ్యారు. పాడుతా తీయగా లేటెస్ట్ సీజన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
Singer Sunitha Daughter
Singer Sunitha Daughter
 
అలాగే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇక జూన్ 19న కూతురు శ్రేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో బర్త్‌డే విషెస్ తెలియజేశారు. అలాగే శ్రేయ ఫోటోలు షేర్ చేశారు. ఇక శ్రేయకు బర్త్ డే విషెస్ చెబుతున్న సునీత ఫ్యాన్స్ వాళ్ళ అమ్మ మాదిరే అందంగా ఉంది. 
 
ఆమె అందం ముందు హీరోయిన్స్ సరిపోరు అంటున్నారు. ఇక శ్రేయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శ్రేయ సింగర్‌గా రాణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో పాడారు. కొడుకు ఆకాష్‌ని మాత్రం హీరోగా చూడాలని సునీత కోరుకుంటున్నారు. ఆకాష్ వెండితెర ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.