1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (03:04 IST)

నాది అని రాసిపెట్టి ఉంటే నాకు రాదా.. అందుకే ఆ పాట పాడా: గాయని నేహ

ఇది నీది అని రాసిపెట్టింది ఏదీ మనది కాకుండా పోదు. ఆ విధంగానే బాహుబలి- ద కన్‌క్లూజన్’లో ‘దండాలయ్యా’ పాటలో నేను కూడా భాగమయ్యా అంటూ సంతోషం వ్యక్తం చేస్తోది వర్ధమాన గాయని ఉమా నేహా. ‘పవనిజం’, ‘నీ తాత టెంపర్‌, ‘జ్యోతిలచ్చిమి’, ‘హైసా అంభానీ పిల్ల’, ‘అక్కిన

ఇది నీది అని రాసిపెట్టింది ఏదీ మనది కాకుండా పోదు. ఆ విధంగానే బాహుబలి- ద కన్‌క్లూజన్’లో ‘దండాలయ్యా’ పాటలో నేను కూడా భాగమయ్యా అంటూ సంతోషం వ్యక్తం చేస్తోది వర్ధమాన గాయని ఉమా నేహా.  ‘పవనిజం’, ‘నీ తాత టెంపర్‌, ‘జ్యోతిలచ్చిమి’, ‘హైసా అంభానీ పిల్ల’, ‘అక్కినేని.. అక్కినేని’ పాటలతో ఆకట్టుకున్న ఆమె రానున్న ‘బాహుబలి-2లో కూడా భాగమైంది.
 
కర్నాటకలోని గుల్‌బర్గాలో పుట్టినప్పటికీ హైదరాబాద్‌లోనే పెరిగి, చదివిన ఉమానేహ తనకు తెలిసింది రెండే.. పాడటం, సంగీత సాధన చేయడం అంటోంది. అనేక సంగీత పోటీల్లో పాల్గొని ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన నేహ .. చక్రి, మణిశర్మ, కీరవాణి, అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ లాంటి ప్రసిద్ధుల సంగీత దర్శకత్వంలో పాడారు. మణిశర్మ, కీరవాణి, అనూప్‌ రూబెన్స్‌, తమన్‌ లాంటి ప్రసిద్ధుల సంగీత దర్శకత్వంలో పాడాను. కీరవాణితోగారితో పనిచేస్తే తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆయనొక యూనివర్శిటీ. రెహమాన్, దేవిశ్రీప్రసాద్‌ సంగీతంలో పాడాలన్నది నా టార్గెట్‌. స్టేజ్‌ మీద దేవిశ్రీ పెర్ఫార్మ్‌ చేస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. 
 
‘బాహుబలి-ద బిగినింగ్‌’లో పాడే అవకాశం దక్కనందుకు నేనేమీ ఫీల్‌ అవలేదు. ‘ఇది నీది’ అని రాసి పెట్టింది ఏదీ మనది కాకుండా పోదు. నా టాలెంట్‌ నన్ను ముందుకు తీసుకెళ్తుందని నా నమ్మకం. వచ్చిన అవకాశాలే మనవి. నాది కానిదాని గురించి అస్సలు ఆలోచించను. ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నట్లుగానే పాటల్లో వాయిస్‌ని కూడా కొత్తగా కోరుకుంటున్నారు. వారి అభిరుచి మేరకే మా లాంటి గాయనీగాయకులు ఉత్సాహంగా దూసుకెళ్తున్నాం. ‘బాహుబలి- ద కన్‌క్లూజన్’లో ‘దండాలయ్యా’ పాటలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారామె.