గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 మే 2021 (11:09 IST)

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీకి ప్రముఖ గాయకుడు "యశస్వి" ఆర్ధిక సాయం

తీవ్రగాయాల పాలై విశాఖ మెడికోవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి  కోరంకి నాగ బ్రహ్మాజీ  వైద్య ఖర్చుల నిమిత్తం ప్రముఖ గాయకుడు సరిగమ టైటిల్ విన్నర్ కొండేపూడి యశస్వి మంగళవారం రూ.10,000లు ఫోన్ పే ద్వారా ఆర్ధిక సహాయం అందించారు.

ఈ నెల7వ తేదీన రోడ్డు ప్రమాదంలో బ్రహ్మాజీ తీవ్రగాయాలు పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కెమెరా మెన్ సాయి బ్రహ్మాజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను యశస్వికి పంపగా ఆయన సత్వరమే స్పందించి బాధితుని స్నేహితులతో మాట్లాడారు. అక్కడ పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆయన ఆ మొత్తాన్ని బాధితుడి అందేలా తగిన చర్యలు తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా బ్రహ్మాజీ వైద్య ఖర్చుల కోసం దిక్కులు చూస్తున్న వారికి యశస్వి రూపంలో ఆపన్న హస్తం ఆదుకుంది. ప్రముఖ గాయకుడు యశస్వికి తాను పంపిన సందేశానికి సత్వరమే స్పందించి బ్రహ్మాజీ కుటుంబానికి ఆర్ధిక చేయూత అందించడం ఎంతో సంతోషకరమని కెమెరా మెన్ సాయి ఆనందం వ్యక్తం చేశారు.