శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 19 మే 2021 (10:16 IST)

కోవిడ్‌ను జ‌యిస్తాను ఇది వేడుక‌ల‌కు స‌మ‌యంకాదుః ఎన్‌.టి.ఆర్‌.

ప్ర‌స్తుతం నేను కోవిడ్ పాజిటివ్‌తో ఐసొలేష‌న్‌లో వున్నాను. నా విష‌యం తెలిసి అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ప్రేమ‌ను మ‌ర్చిపోలేను. మీ వీడియోలు, సందేశాలు చూస్తున్నాను. మీ ఆద‌రాభిమానాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌ల‌ను అంటూ ఎన్‌.టి.ఆర్‌. బుధ‌వారంనాడు ట్విట్ట‌ర్‌లో త‌న సందేశాన్ని తెలియ‌జేశారు. రేపు ఎన్‌.టి.ఆర్‌. పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు సంబంధించి ఏదైనా కొత్త వార్త వ‌స్తుంద‌ని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్‌.టి.ఆర్‌. ఏమ‌న్నారో చూద్దాం.
 
ప్ర‌తి ఏడాది నా పుట్టిన‌రోజున మీరు చూపే ప్రేమ ఆద‌రాభిమానాల‌కు చేసే కార్య‌క్ర‌మాలను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ను పాటిస్తూ మీరు మీ కుటుంబాల‌తో ఇంటిలోనే జాగ్ర‌త్త‌గా వుండండి. ఇది వేడుక‌ల‌కు స‌మ‌యం కాదు. మ‌నం క‌నిపించ‌ని వైర‌స్ తో యుద్ధం చేస్తున్నాం. కోవిడ్ వారియ‌ర్స్ న‌ర్సులు, డాక్ట‌ర్ల‌కు మ‌నం సంఘీభావం తెలియ‌జేద్దాం. 
 
మీరు జాగ్ర‌త్త‌గా వుండండి. మాస్క్‌లు ధ‌రించండి. నేను కోవిడ్‌ను జ‌యిస్తాను. ఆరోజున అంద‌రం క‌లిసి వేడుక చేసుకుందాం. మాస్క్ ధ‌రించ‌డండి. జాగ్ర‌త్త‌గా వుండండి.
 
మా విన్న‌పాన్నిమ‌న్నిస్తార‌ని- మీ నంద‌మూరి తారక‌రామారావు అంటూ పేర్కొన్నారు.