బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (13:58 IST)

మా అధ్యక్ష ఎన్నికలు.. మెగా సోదరుడికి కూడా చుట్టుకుంటోంది..

మా పరువుని బజారు కీడ్చేసిన అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మెగా సోదరుడికి కూడా చుట్టుకుంటోంది... 'మా' ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తాజాగా మాజీ అయిన అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ... "నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే నా నుండి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అది తరువాత చెబుతాను" అని వ్యాఖ్యానించారు. మీడియాతో తనకు ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉందనీ, తాను కుట్రలు చేసేవాడినో, కాదో మీడియా మొత్తానికీ తెలుసునని అన్నారు. 
 
ప్రతి సంవత్సరమూ 'మా' డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తామని, ఈ సంవత్సరమూ బాగా చేసామని చెప్పుకొచ్చారు. డైరీ వేసినందుకుగానూ రూ. 14.20 లక్షలు వచ్చిందని గొప్పగా చెప్పుకున్న నరేష్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేసారనీ, మిగిలిన డబ్బు ఏమైందనీ ప్రశ్నించారు. తాను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందనీ, ఒకటో తేదీలోగా మిగతా డబ్బు 'మా' ఖాతాలో వేయాలని ఆయన డిమాండ్ చేసారు. మిగతా డబ్బు ఏమైందో చెప్పి, వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని కూడా ఆయన సలహా ఇచ్చారు.
 
'మా' అధ్యక్ష ఎన్నికలేమో కానీ... చిత్ర పరిశ్రమని మొత్తం బజారుకు ఈడ్చేసారు... ఇప్పుడేమో మెగా సోదరుడి వంతు వచ్చింది... ముందు ముందు... ఇంకా ఎవరు రాబోతారో...?