శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (14:53 IST)

టీవీ యాంకర్‌కు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

''మా'' ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కినేని నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఫిలిమ్ ఛాంబర్‌కు వెళ్లారు. ఓటేసి ఇద్దరూ కలిసి కారు వద్దకు బయల్దేరుతున్నప్పుడు వారిని మీడియా చుట్టేసింది. ఇంకా అభిమానులు కూడా వీరిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అభిమానులను అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు.. చిరంజీవిని, నాగార్జునన కారు వద్దకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టింది. 
 
అయితే చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్‌కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది అడ్డుకోబోవడంతో యాంకర్ పడిపోయేంతలో '' ఏయ్ ఆగండి'' అంటూ చిరంజీవి ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి.. ''సారీ అమ్మా'' అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని చూసిన అక్కడ వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు.