బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (22:31 IST)

రాజకీయ వేడిని తలపిస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు.. ఎందుకు..?

తెలుగు సినీపరిశ్రమలో మా అసోసియేషన్ ఎన్నికలు చాలా కీలకమైనవి. పరిశ్రమలోని టాప్ స్థాయిలో ఉన్న నటులు మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయరు కానీ క్రిందిస్థాయిలో ఉన్న నటులు పోటీ చేస్తారు. త్వరలో ఎన్నికలు జరుగబోతున్నాయి. నటుడు శివాజీరాజా, మరో నటుడు నరేష్‌‌లు రెండు వేర్వేరు ప్యానళ్ళతో పోటీలోకి దిగుతున్నారు.
 
అయితే ఈ పోటీ కాస్త ఇప్పుడు సినీపరిశ్రమలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోను చర్చకు దారితీస్తోంది. ఎన్నికల వేడి కన్నా తెలుగు సినీపరిశ్రమలో నెలకొన్న ఎన్నికల వేడే ఎక్కువగా కనిపిస్తోందట. దీంతో ప్రజలు ఆశక్తిగా ఎప్పుడు ఏం జరుగుతుందోనని చూస్తున్నారు. ఒకరేమో చిరంజీవి మా ప్యానల్‌కే సపోర్ట్ చేస్తున్నారని చెబుతున్నారు. మరొకరేమో మెగాస్టార్ ఆశీస్సులు మాకేనంటూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెబుతున్నారు. దీంతో ప్రజల్లో కన్ఫూజన్ స్టార్టయ్యింది. 
 
సినీపరిశ్రమలో క్యారెక్టర్లను వదిలి ఎన్నికలపై ఈ స్థాయిలో పోటీ జరగడం ఇదే ప్రదమమంటున్నారు సినీవిశ్లేషకులు. నరేష్ తో పాటు శివాజీరాజా ప్యానెల్లో ఉన్న సినీ ఆర్టిస్టులు అందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇది ఏ స్థాయికి చేరుకుంటోందనని సినీవిశ్లేషకులు సైతం ఆసక్తిగా తిలకిస్తున్నారు.