సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2019 (17:55 IST)

రాజ‌శేఖ‌రా... ఇది ఎప్ప‌టి సినిమా నాయ‌నా..?

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడుగా న‌టిస్తోన్న తాజా చిత్రం క‌ల్కి. అ సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని ప్రేక్ష‌కుల అభినంద‌న‌ల్ని అందుకున్న‌ ప్ర‌శాంత వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ఈ సినిమా కంటే ముందుగా రాజ‌శేఖ‌ర్ న‌టించిన మ‌రో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇంత‌కీ ఏ సినిమా అంటారా..?  రాజ‌శేఖ‌ర్ న‌టించిన అర్జున‌. ఈ సినిమాకి క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
ఇందులో రాజ‌శేఖ‌ర్ ద్విపాత్రాభిన‌యం చేసారు. ఈ చిత్రాన్ని సీకే ఎంట‌ర్ టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. మ‌రియ‌మ్ జ‌కారికా క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు కీల‌క పాత్ర పోషించారు. పొలిటిక‌ల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ యువ‌కుడిగా, కాస్త వ‌య‌సు పైబ‌డిన వాడిగా రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికెట్ పొందిన ఈ సినిమాని ఈ నెల 15న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.