రసవత్తరంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్ అసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకాగా, మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వేడుకలు రసవత్తరంగా సాగనున్నాయి.
గతంలో రాజేంద్ర ప్రసాద్, జయసుధలు మా పీఠం దక్కించుకునేందుకు పోఠీ పడగా విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఎన్నికలని రసవత్తరంగా మార్చారు. ఇక ఇప్పుడు శివాజీ రాజా, నరేష్‌లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు గుప్పిస్తూ మా పీఠం దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
దీంతో నరేష్, శివాజీ రాజా ప్యానెల్స్‌లో ఎవరు గెలుస్తారనేది మరి కొద్ది గంటలలో తెలియనుంది. సుమారు 800 మంది మూవీ ఆర్టిస్టులు ఎన్నికలలో పాల్గొననున్నారు. నరేష్ ప్యానెల్‌కి నాగబాబు, మహేష్ బాబు, జీవిత, రాజశేఖర్ వంటి స్టార్స్ మద్దతునిస్తుండగా, శివాజీ రాజాకి మాత్రం మద్దతు కరువైంది.
ఉపాధ్యక్ష పదవికి నటి హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. శివాజీ రాజా తరపున మ్యా పానెల్ బరిలో 25 మంది సభ్యులు ఉండగా, నరేష్ ప్యానెల్ బరిలో 23 మంది సభ్యులు ఉన్నారు. సాయంత్రం 5 గంటలకి ఓట్ల లెక్కింపు మొదలు కానుండగా, అర్థరాత్రి లోపు ఫలితాలు వెలువడనున్నాయి.