ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (13:53 IST)

ఆర్య, సాయేషా సైగల్ ప్రీ వెడ్డింగ్.. తరలివచ్చిన తారాలోకం..

ఆర్య, సాయేషా సైగల్ వివాహ వేడుకకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఈ వివాహం జరుగనుండడం విశేషం. మార్చి 9, 10 తేదీలలో వీరి పెళ్లి, రిసెప్షన్‌ జరుగనుంది. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్య, సాయేషాల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ హైదరాబాదులో జరిగింది.
 
హైదరాబాద్‌లో పెద్దల సమక్షంలో ఆదివారం (మార్చి 10) వీరి వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో బాలీవుడ్‌ సెలబ్రిటీలు సంజయ్‌ దత్‌, ఆదిత్యా పంచోలీ, ఖుషి కపూర్‌, పలువురు కోలీవుడ్‌ నటులు సందడి చేశారు.

సాయేషా గులాబి రంగు లెహెంగాలో మెరిశారు. తన సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.