శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (16:52 IST)

హైదరాబాదులో ఆర్య-సాయేషాల వివాహం..

ఆర్య, సాయేషా సైగల్ వివాహం హైదరాబాదులో అట్టహాసంగా జరుగనుంది. ఫిబ్రవరి 14న తమ వివాహంపై ఈ జంట అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వీరి పెళ్లి తంతు అంగరంగవైభవంగా జరుగనుంది. మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం సంగీత్ కార్యక్రమం, మరుసటి రోజు నిక్కా జరుగనుంది. ఆర్య-సాయేషా వివాహ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు. 
 
హైదరాబాదులో వివాహం జరిగిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ వుంటుందని తెలుస్తోంది. సాయేషా ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. పెళ్లికి తర్వాత కూడా సాయేషా సినిమాల్లో నటిస్తుందని సమాచారం. సాయేషా-ఆర్యల వివాహం ప్రేమ వివాహం కాదని.. పెద్దల కుదిర్చిన వివాహమని సాయేషా తల్లి షహీన్ తెలిపారు. ఆర్య మా ఇంటి అల్లుడు కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసింది.