గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (11:15 IST)

ప్రేమిస్తారు.. బ్రేకప్ అంటారు.. ఇంకొకర్ని ప్రేమిస్తారు.. అదెలా సాధ్యం.. ఐశ్వర్యా రాజేశ్

ప్రేమలో తాను దురదృష్టవంతురాలిని అని కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ చెప్తోంది. పుట్టింది.. పెరిగింది.. తెలుగు అమ్మాయిగానే అయినప్పటికీ.. టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌లోనే తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో వున్న ఐశ్వర్యా రాజేశ్.. ప్రేమ విషయంలో మాత్రం డీలా పడిపోయిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. తాను ప్రస్తుతానికి సింగ్ అని స్టేట్మెంట్ ఇచ్చింది. 
 
ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డానని.. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయిందని చెప్పుకొచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని స్నేహితురాలే ఎగరేసుకుని పోయిందని తెలిపింది.ఆపై కొన్నేళ్ల తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డానని.. అప్పుడు కూడా తాను విడిపోవలసిన పరిస్థితి వచ్చిందని ఐశ్వర్య వెల్లడించింది.
 
ప్రేమంటే చిరకాలం వుండాలని భావిస్తానని... కొందరు మాత్రం ప్రేమించుకుని .. బ్రేకప్ అయి మరొకరిని ప్రేమిస్తుంటారని.. అది ఎలా సాధ్యమో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. డేట్ కోసం వెళ్లాలనుకునుకుంటే.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (ధోనీ బయోపిక్‌లో నటించిన హీరో)తోనని చెప్పింది