మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (13:18 IST)

అమరన్ హిట్.. శివ కార్తీకేయన్‌కు హగ్- కన్నీళ్లు పెట్టుకున్నారు.. (video)

Amaran
Amaran
దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ ఇందులో ముకుంద్ రోల్ ప్లే చేశారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్‌తో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 
 
శివ కార్తికేయన్, సాయి పల్లవిల అభినయం నెక్ట్స్ లెవెల్ అని చూసిన వారందరూ చెబుతున్నారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. హైదరాబాదులో జరిగిన అమరన్ సక్సెస్ మీట్‌కు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరయ్యారు. 
 
కొందరు లేడీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారు. శివకార్తికేయన్‌ను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిని చూసి అక్కడున్నవారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.