గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళీకృష్ణ
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (16:52 IST)

రిపబ్లిక్ డే.. ఓటీటీలో సోలో బ్రతుకే సో బెటర్..

Solo Brathuke So Better
తెలుగు ప్రజలకు వినోదం అందించడమే లక్ష్యంగా ప్రతి వారం, ప్రతి నెల సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు విడుదల చేస్తున్న ఏకైక ఓటీటీ వేదిక 'జీ 5'. గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా సహా 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు విడుదల చేయనుంది.
 
సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను జీ గ్రూప్ థియేటర్లలో విడుదల చేసింది. లాక్ డౌన్ తరువాత వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇప్పుడు డిజిటల్ తెర వీక్షకులకు వినోదాన్ని అందించడానికి ఓటీటీలో ఈనెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమైంది. 
 
ఇప్పటికే కరోనా కాలంలో ఇళ్లకు పరిమితమైన ప్రజలకు 'అమృతం ద్వితీయం' ఎపిసోడ్లు వినోదాన్ని అందించిన సంగతి తెలిసిందే వీక్షకులు మెచ్చిన ఈ సిరీస్ నుంచి సరికొత్త ఎపిసోడ్లను సైతం ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
 
ఆల్రెడీ జనవరిలో రెండు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, ఒక తెలుగు సినిమాతో పాటు 'వర్జిన్ భాస్కర్' సీజన్ 2ను తెలుగు వీక్షకులకు 'జీ 5' ఓటీటీ అందించింది. ఈ నెల 13న సూరజ్ పే మంగళ్ భరి తెలుగు వెర్షన్ ను విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న 'నేను కేరాఫ్ నువ్వు' వెబ్ సిరీస్ తొలి సీజన్, 15న 'రోమియో జూలియట్' సినిమా, 19న 'శివంగి' తొలి సీజన్ పార్ట్ 1 'జీ 5'లో వీక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు 25న 'సోలో బ్రతుకే సో బెటర్', 'అమృతం ద్వితీయం' కొత్త ఎపిసోడ్లు వస్తున్నాయి. 
 
బహుశా... తెలుగు వీక్షకులకు ఎక్కువ ఒరిజినల్ సిరీస్ లు, డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్ సినిమాలు అందించిన ఓటీటీ 'జీ 5' అంటే అతిశయోక్తి కాదేమో. ఆల్రెడీ 'కైలాసపురం', 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి (గాడ్)', 'చదరంగం', 'అమృతం ద్వితీయం', 'లూజర్', 'ఎక్స్ పైరీ డేట్', 'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' వంటి హిట్ సిరీస్‌లు ప్రజలకు అందించినది జీ 5 అనే సంగతి తెలిసిందే.