సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 డిశెంబరు 2022 (15:35 IST)

సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్.. ఎందుకో తెలుసా? (video)

sonusood mumabi
బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోనూ రైలు ఫుట్ బోర్డుపై కూర్చుని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. 
 
కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం తప్పుబడుతున్నారు. 
 
రైలు వేగాన్ని పెంచుతున్నప్పుడు మిస్టర్ సూద్ హ్యాండ్‌రైల్‌ను పట్టుకుని బయట చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ముంబై రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.