గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:24 IST)

సోమవారానికి శుభవార్త.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం : ఎస్.పి. చరణ్

తన తండ్రి ఆరోగ్యంపై త్వరలోనే శుభవార్త చెబుతానని ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.బి. చరణ్ గురువారం  వెల్లడించారు. అలాగే వచ్చే సోమవారానికి శుభవార్త చెబుతానని, ఆ తర్వాత తన తండ్రిని మీకు చూపిస్తానని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 'నాన్న ఆరోగ్యం వ‌రుస‌గా నాలుగోరోజు నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. దేవుడి ద‌య‌, మీ అంద‌రి ప్రార్థ‌న‌ల వ‌ల్ల వ‌చ్చే సోమ‌వారం నాటికి నాన్న ఆరోగ్య విష‌యంలో శుభవార్త వెలువడుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు' ఆయ‌న చెప్పారు.. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.. ప్ర‌తి ఒక్క‌రిని దేవుడు ఆశీర్వ‌దించాల‌ని కోరుతూ ఎస్పీ చ‌ర‌ణ్ పేర్కొన్నారు. 
 
అలాగే ఎస్పీబాలు ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్ప‌త్రి గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు స్ప‌ష్టంచేశారు. వెంటిలేట‌ర్‌, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నామ‌న్నారు. బాలు చికిత్స‌కు స్పందిస్తున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు నిపుణుల బృందం పర్య‌వేక్షిస్తోంద‌న్నారు. ఆగ‌స్టు 5వ తేదీన బాలుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఎస్పీ బాలు ఆరోగ్యం ప‌రిస్థితిపై ఆయ‌న కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించారు.