మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (18:01 IST)

రేణు దేశాయ్ గారూ.. మీరు ఓ నరకం నుంచి బయటపడ్డారు.. శ్రీరెడ్డి

వివాదాస్పద నటి, క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా గళం విప్పిన శ్రీరెడ్డి ప్రస్తుతం నోటికి పని చెప్పింది. మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌పై విమర్శలు చేసింది. ఇంకా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా సీన్లోకి లాగింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. శ్రీరెడ్డి ఈ మధ్య పాజిటివ్ పోస్టులు కూడా చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ ట్రైలర్ బాగుంది అంటూ పాజిటివ్ కామెంట్స్ చేసింది. 
 
కొన్ని గంటలు కూడా గడవకముందే రేణు దేశాయ్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. పవన్ కల్యాణ్ మాజీ భార్య కావడంతో శ్రీ రెడ్డి చేసే కామెంట్స్ కచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేసేవిగానే ఉంటాయి. పైగా రేణు కూడా ఈ మధ్య పవన్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.  తన జీవితం తాను చూసుకుపోతోంది. ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు దర్శకురాలిగానూ మారాలని చూస్తుంది రేణు. ఈ మధ్య దిశ ఎపిసోడ్ గురించి కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేసింది రేణు.
 
తాజాగా రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రేణూ గారూ బెస్ట్ ఆఫ్ లక్.. మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా.. మీరు ఓ నరకం నుంచి బయటికి వచ్చారంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన కామెంట్స్ మళ్ళీ పవన్‌ను టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి. దాంతో పవన్ అభిమానులతో శ్రీ రెడ్డి యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు రేణు దేశాయ్‌ను సైతం మధ్యలోకి తీసుకురావడం వెనక శ్రీ రెడ్డి అంతరార్థం ఏంటో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఏదేమైనా కూడా ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే శ్రీరెడ్డికి నిద్రపట్టేలా లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.