గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (21:31 IST)

'బాహుబలి' వంటి కథలు వద్దంటున్న ఎస్ఎస్.రాజమౌళి.. ఎందుకో తెలుసా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనధాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. ఈనేపథ్యం

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనధాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. ఈనేపథ్యంలో రాజమౌళి తీయనున్న తదుపరి చిత్రంపై అపుడే ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై చర్చోపచర్చలు కూడా సాగుతున్నాయి. 
 
అదేసమయంలో బాహుబలి 3 తీస్తాడనే వార్తలకు ఆయన తండ్రి, బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్‌స్టాఫ్ పెట్టారు. అంతేనా... బాహుబలి వంటి కథలు వద్దని రాజమౌళి చెప్పారని వెల్లడించారు. 
 
ఇదే అంశంపై విజయేంద్ర ప్రసాద్ తాజాగా స్పందిస్తూ... రాజమౌళి ఎలాంటి కథను కావాలనుకుంటున్నాడో చెప్పారు. తర్వాతి సినిమాకు ఎలాంటి కథ కావాలో రాజమౌళి చెప్పలేదు కానీ... ఎలాంటి కథలు వద్దో మాత్రం చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. 
 
తన తదుపరి చిత్రానికి గ్రాఫిక్స్ అవసరం లేని కథ కావాలని విజయేంద్ర ప్రసాద్‌కు జక్కన్న చెప్పాడట. దానికి అనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇక, అంతకుముందే.. తన తదుపరి చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ లేకుండా, కమల్ కణ్ణన్ లేకుండా తీస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.