శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (22:04 IST)

ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్.. 13 రోజుల తర్వాత పట్టుకున్నారు..

Kanal Kannan
Kanal Kannan
శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్‌ విగ్రహాన్ని బద్దలు కొట్టాలని వ్యాఖ్యలు చేసిన ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ పోలీసులు అరెస్ట్ చేశారు.  
 
తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పుదుచ్చేరిలో కణల్ కన్నన్ అరెస్ట్‌ చేశారు.  
 
వివరాల్లోకి వెళితే.. హిందూ మున్నని సమాఖ్య హిందువుల పరిరక్షణ కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కణల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కణల్ కన్నన్ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
 
శ్రీరంగం ఆలయం ఎదురుగా, దేవుడిపై నమ్మకం లేని పెరియార్‌ విగ్రహాన్ని బద్దలు కొట్టాలని వ్యాఖ్యలు చేశారు కణల్ కన్నన్.. అప్పుడే మనం హిందువులుగా మరింత ఎదుగుతాం అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. పరారీలో వుండిన కణల్ కన్నన్‌ను 13 రోజుల తర్వాత పుదుచ్చేరిలో పోలీసులు అదుపులో తీసుకున్నారు.