ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (18:00 IST)

శర్వానంద్‌ ఒకే ఒక జీవితం లిరికల్ వీడియో

Sharwanand, Ritu Varma, Vennela Kishore, Priyadarshi
Sharwanand, Ritu Varma, Vennela Kishore, Priyadarshi
హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది.
 
మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ''ఒకటే కదా'' సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కథానాయకుడి జీవితం, సోల్‌మేట్‌ సెర్చింగ్ నేపధ్యంలో చాలా ఆసక్తికరంగా సాగింది. జేక్స్ బిజోయ్ ఈ పాట కోసం యూత్ ఫుల్, ట్రెండీ ట్యూన్ ని కంపోజ్ చేయగా, పాటకు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. గౌతమ్ భరద్వాజ్ పాటని ఎనర్జిటిక్ గా పాడిన విధానం ఆకట్టుకుంది.
 
ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అమ్మ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు, ఒకటే కదా పాట బ్రిలియంట్ కంపోజిషన్, ఆకట్టుకునే సాహిత్యం, వాయిస్ తో అలరిస్తోంది.
 
సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా,  శ్రీజిత్ సారంగ్ ఎడిటర్ గా, సతీష్ కుమార్ ఆర్ట్  డైరెక్టర్ గా పని చేస్తున్నారు.  తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళంలో 'కణం' పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు మరిన్ని సర్ ప్రైజ్ ప్రకటనలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.