శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (12:27 IST)

ఆస్కార్ రేసులో ఆకాశమే నీ హద్దు రా...

Aakasame Nee Haddu Ra
సూర్య నటించిన ఆకాశమే హద్దు రా సినిమా ఆస్కార్‌కు పోటీపడనుంది. సుధా కొంగర డైరక్ట్ చేసిన ఈ మూవీ ఆస్కార్ రేసులో ఉంది. జనరల్ క్యాటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు పోటీపడుతుంది. బెస్ట్ యాక్టర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ డైరక్టర్‌తో పాటు మరికొన్ని కేటగిరీల్లో ఈ సినిమా పోటీపడనుంది. 
 
తెలుగులో ఆకాశం నీ హద్దురా అన్న టైటిల్‌తో ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా సినిమాను రూపొందించారు. సూర్య కీలక పాత్ర పోషించారు. అపర్ణా బాలమురళి, పరేశ్ రావల్ దీంట్లో నటించారు. తమిళ సినిమా సూరారై పొట్రు సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయినట్లు ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
బెస్ట్ యాక్టర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ డైరక్టర్‌, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జనరల్ క్యాటగిరీలో పోటీపడనున్నట్లు పాండియన్ తెలిపారు. అకాడమీలో తమ సినిమా స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ దక్కిందన్నాడు. గత ఏడాది లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్లు బంద్ చేసిన సంగతి తెలిసిందే.
 
అయితే ఓటీటీ ఫార్మాట్‌లో సురారై పొట్రును రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఆకాశం నీ హద్దురా సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్స్ వేడుక జరగనుంది.