శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (16:30 IST)

ఈటీకి లైన్ క్లియర్.. థియేటర్లలో రిలీజ్

కోలీవుడ్‌ అగ్రహీరో సూర్య నటించిన 'ఎదర్కుం తుణిందవన్‌' (ఈటీ) ఈ నెల 10వ తేదీ గురువారం పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.
 
కోలీవుడ్ సింగం హీరో సూర్య నటించిన ఈటీ సినిమా మార్చి 10వ తేదీన విడుదల కానుంది. కరోనా కారణంగా సూర్య సినిమా థియేటర్‌లో రెండున్నరేళ్ళ తర్వాత విడుదల కానుంది. సూర్య నటించిన 'కాప్పాన్‌' చిత్రం 2019లో థియేటర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2020లో వచ్చిన 'సూరరైపోట్రు', 2021లో వచ్చిన 'జైభీమ్‌' చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగా రాణించాయి. 
 
అయితే సూర్య సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కాకపోవడంతో థియేటర్ యజమానులు కాస్త ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలను భవిష్యత్తులో విడుదల చేయమంటూ మొండికేశారు. దీంతో సూర్య చిత్రాలకు చిక్కులు తప్పవని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. దీంతో ఈటీ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది.