శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (14:15 IST)

కోలీవుడ్‌లో రాజశేఖర్ కూతుళ్ల హవా

హీరో రాజశేఖర్ కూతుళ్లు కోలీవుడ్‌లో కుదురుకునేందుకు సిద్ధంగా వున్నారు. తాజాగా శివాని చేసిన 'అద్భుతం' ఓటీటీలో విడుదలైంది. ఇక ఆల్రెడీ 'దొరసాని' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివాత్మిక, 'రంగమార్తాండ'లోను కనిపించనుంది. 
 
ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా కోలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
 
తమిళంలో శివాని చేసిన 'అన్బరివు' వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివాత్మిక చేసిన 'ఆనందం విలయాడుం వీడు' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.