శుక్రవారం, 9 జూన్ 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated: గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:50 IST)

మాస్టర్ బ్లాస్టర్‌లో తమిళ హీరో సూర్య భేటీ

surya sachin
భారత క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో కోలీవుడ్ హీరో సూర్య సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోను సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే తాము ఎక్కడ కలుసుకున్నదీ సూర్య వెల్లడించలేదు. అయితే, వీరి భేటీ ముంబైలోనే జరిగివుంటుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
 
ఈ మధ్య కాలంలో సూర్య తరచుగా ముంబై, చెన్నై మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. దీనికి కారణం ఆయన భార్య, సినీ నటి జ్యోతిక తన మకాంను ముంబైకు మార్చింది. దీంతో సూర్య కూడా చెన్నై, ముంబైల మధ్య తరచూ తిరుగుతున్నారు. 
 
"సచిన్ టెండూల్కర్ అంటే గౌరవం, ప్రేమ" అని సూర్య షేర్ చేసిన ఫోటో కింద క్యాప్షన్ జోడించారు. దీనికి అభిమానులు హార్ట్ ఎమోజీలతో పెద్ద ఎత్తున స్పందిస్తూ, షేర్ చేస్తున్నారు. 
 
కాగా, సూర్య త్వరలోనే బాలీవుడ్ రంగ ప్రవేశం చేయనున్నారు. ఆయన నటిస్తున్న ఒక చిత్రం ఏకంగా పదికిపైగా భాషల్లో తెరకెక్కతుంది. అలాగే, తన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానరుపై తాను నటించిన సూపరైపోట్రు చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.