శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (15:10 IST)

ఏపీ కొత్త గవర్నర్ నజీర‌ను కలిసిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ

raghurama raju - nazir
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‍‌ను ఏపీకి చెందిన వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మంగళవారం ఢిల్లీలో కలుసుకున్నారు. ఢిల్లీలోని జస్టిస్ నజీర్ నివాసానికి ఈ ఉదయం వెళ్లిన రఘురామరాజు పుష్పగుచ్ఛాన్ని అందించి, శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉన్న శాలువాను కప్పి గౌరవించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం మర్యాదపూర్వకంగానే గవర్నరును కలిశానని చెప్పారు. రాష్ట్ర గవర్నరుగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పలు కీలక కేసులను విచారించారు. 
 
ఇలాంటి కేసుల్లో ప్రధానంగా అయోధ్య భూవివాదం, ట్రిపుల్ తలాఖ్ వంటి కేసుల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. ఇప్పటివరకు ఉన్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి బదిలీ చేసిన విషయం తెల్సిందే.