శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 మే 2020 (10:26 IST)

సూర్యకు గాయాలు.. వర్కౌట్ చేస్తుండగా ఎడమ చెయ్యికి..?

కోలీవుడ్ నటుడు సూర్యకు గాయాలైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కలవరపడుతున్నారు. అయితే సన్నిహితుల సమాచారం ప్రకారం సూర్య ఇంట్లో వర్కౌట్‌ చేస్తుండగా ఆయన ఎడమ చెయ్యికి గాయమైందట. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారట. ఆయన గాయం దాదాపు నయమైందని తెలుస్తుంది. 
 
లాక్‌ డౌన్‌ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే సూర్య కొద్ది రోజులగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. నటుడిగానే కాకుండా నిర్మాతగాను రాణిస్తున్న ఆయన జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన పొన్ మగళ్ వందాళ్ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నారు. ఇక తనకు గాయాలు ఏర్పడటంపై సూర్య సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తనకు పెద్ద గాయం కాలేదని.. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు. 
 
కాగా... తమిళ స్టార్ హీరో సూర్యకు కోలీవుడ్‌లోనే కాదు... టాలీవుడ్‌లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే సూర్య సినిమాలు చూసేందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇష్టపడతారని తెలిసింది.