శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (17:52 IST)

దీప్తి సునయన, షణ్ముఖ్‌ల ప్రేమ ఓకే.. పెళ్లెప్పుడంటే..?

Deepthi Sunaina
సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీగా మారిన దీప్తి సునయన, షణ్ముఖ్‌ల గురించి.. సోషల్ మీడియా ఫాలోవర్స్ కి అందరికీ తెలిసిందే. దీప్తి సునయన సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో సెలబ్రిటీగా మారింది. అంతేకాకుండా ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
 
ఇక షణ్ముక్ యూట్యూబ్ స్టార్‌గా నిలిచి ప్రేమకు సంబంధించిన వెబ్ సిరీస్‌లలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు. ఈయనకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. దీప్తి సునయనతో కలిసి కొన్ని వీడియోలు కూడా చేశాడు షణ్ముఖ్. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీడియోలన్నీ వైరల్‌గా మారగా.. ఇక వీరి మధ్య ఉన్న రిలేషన్ కూడా వైరల్‌గా మారింది. 
 
అంతేకాకుండా బయట కూడా వీరి రిలేషన్ చూసి నిజంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారా అని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఓ క్లారిటీ ఇవ్వగా.. తాము ఆఫ్ స్క్రీన్ కపుల్స్ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాకుండా వీళ్ళ చేతులపై ఒకే తరహా టాటూ కూడా అందర్నీ కాస్త ఆలోచనలో పడేలా చేసాయి.
 
ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి రిలేషన్ గురించి ఓ వెబ్ సిరీస్ నటుడు సూర్య స్వామి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా.. అందులో దీప్తి, షణ్ముఖ్ ల పెళ్లి గురించి ప్రస్తావన వెళ్ళింది. దాంతో సూర్య..' అందులో తప్పేముంది. ఎవరి ఇష్టం వారిదని ఇంకో రెండేళ్లలో వారి పెళ్లి కూడా చేసుకోవచ్చు' అని అనగా.. ఈ విషయం బాగా వైరల్ గా మారింది. ఇక ఈ విషయం గురించి ఈ జంట ఎలా స్పందిస్తారో చూడాలి.