శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 21 మే 2018 (13:20 IST)

అవార్డు ఫంక్షన్.. రద్దీగా వున్న ప్రాంతంలో 15 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే?: సుస్మితా సేన్

హాలీవుడ్‌లో మీటూ అనే హ్యాష్‌ట్యాగ్‌పై సెలెబ్రిటీలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పుతున్న వేళ.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి బయటపెడుతున్నారు. ఈ జాబితాలోకి

హాలీవుడ్‌లో మీటూ అనే హ్యాష్‌ట్యాగ్‌పై సెలెబ్రిటీలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి నోరు విప్పుతున్న వేళ.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను గురించి బయటపెడుతున్నారు. ఈ జాబితాలోకి ప్రస్తుతం బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా చేరిపోయింది. ముంబైలో జరిగిన 'మేక్ యార్ సిటీ సేఫ్' కార్యక్రమంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. 
 
ఆరు నెలల క్రితం తనకు ఓ చేదుఅనుభవం ఎదురైందని చెప్పింది. ఓ అవార్డుల ఫంక్షన్లో ఓ కుర్రాడు రద్దీగా వున్న ప్రదేశంలో తనపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఎవరూ గుర్తించరని తనపని తాను చేసుకుందామనుకున్న కుర్రాడికి తాను షాకిచ్చానని చెప్పింది. వెనకనుంచి అతని చేతిని పట్టుకున్నానని సుస్మితా చెప్పింది.
 
తర్వాత చూస్తే అతనో కుర్రాడు. 15ఏళ్ల వయస్సుండే కుర్రాడు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై షాక్ అయ్యానని.. అతని మెడను పట్టుకుని పక్కకు లాగి.. తాను గొడవ చేస్తే.. నీ జీవితం ఏమౌతుందో తెలుసా అనే సరికి సారీ చెప్పాడు. అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతనిపై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేశానని సుస్మిత తెలిపింది. కానీ, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.