శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (14:06 IST)

రుద్రమదేవి మాటల రచయిత.. రాజసింహ ఆత్మహత్యాయత్నం.. కారణం?

రుద్రమదేవి మాటలు రచయిత ఆత్మహత్యాయత్నం చేశాడు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమాకు మాటలు రాసిన రాజసింహ ముంబైలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముంబైలో నిద్రమా

రుద్రమదేవి మాటలు రచయిత ఆత్మహత్యాయత్నం చేశాడు. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రుద్రమదేవి సినిమాకు మాటలు రాసిన రాజసింహ ముంబైలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముంబైలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. 
 
నిద్రమాత్రలు మింగి సోఫాపై పడివుండటంతో ఆయన్ని బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. సినీ కెరీర్ పరంగా రాణించలేకపోతున్నాననే మనస్తాపంతో రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్న రాజసింహ, అవకాశాలు ఆశించినంతగా రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.