సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 8 మే 2019 (18:36 IST)

అవును.. విక్కీతో కలిసి ఫూటుగా మందేసి.. ఆ రాత్రి అక్కడే పడిపోయా.. తాప్సీ

అర్థరాత్రి ఫూటుగా తాగి స్టార్ హోటళ్లో తాప్సీ నానా హంగామా చేసిందట. టాలీవుడ్, కోలీవుడ్, మూలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్ర హీరోల సరసన నటించినా తాప్సీకి మంచి హిట్ మాత్రం అల్లంత దూరంలో నిలిచిపోయింది.


తాజాగా బాలీవుడ్ టీవీ ఛానల్‌లో తాప్సీ‌తో పాటు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ పాల్గొన్నారు. ఈ షోలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. తాప్సీకి తాగుడు అలవాటు నిజమేనని ఒప్పుకున్నాడు. 
 
ఇంకా విక్కీ మాట్లాడుతూ... ఓ రోజు అర్థరాత్రి స్టార్ హోటళ్లో తాప్సీ ఫూటుగా తాగేసి.. హోటల్‌కు బయట గల పచ్చని గడ్డిపై పడిపోయిందని.. ఆ రోజు అర్థరాత్రి కావడంతో.. పచ్చిగడ్డిపైనే నిద్రపోదామని పట్టుబట్టిందని విక్కీ తెలిపాడు.
 
విక్కీ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ.. అవును.. పార్టీలో ఫూటుగా తాగిన మాట నిజమేనని అంగీకరించింది. ఫూటుగా తాగి నానా హంగామా చేశానని విక్కీ చెప్పాడు. పచ్చగడ్డిపైనే సెటిలైపోతే ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోతానని విక్కీ బెదిరించడంతో అక్కడ నుంచి కదిలానని.. ఆ రోజు ఇద్దరూ మందేశామని చెప్పుకుని నవ్వుకున్నారు. అదన్నమాట సంగతి..