1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (18:34 IST)

మాథిస్ బోతో ప్రేమలో వున్నాను.. పెళ్లి గురించి ఆలోచిస్తున్నా.. తాప్సీ

tapsee pannu
తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో ఉందంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ వార్తలపై తాప్సీ స్పందించింది. మాథిస్ బోతో తాను దాదాపు పదేళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని తాప్సీ తెలిపింది. 
 
దక్షిణాది ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి.. ఆ బంధం కాస్త బలపడిందని చెప్పుకొచ్చింది. 
 
అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది. ప్రేమ, పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది. మాథిస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.