ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (13:21 IST)

కమల్ హాసన్- శ్రీవిద్య ప్రేమ.. పెళ్లి చేసుకోలేకపోయాం.. మూడుసార్లు అబార్షన్..

Sri vidya_Kamal Haasan
Sri vidya_Kamal Haasan
సినీ లెజెండ్ కమల్ హాసన్ తన ప్రియురాలిని గుర్తు చేసుకున్నారు. ఆమె గురించిన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన మూవీలో కమల్ సరసన దివంగత శ్రీ విద్య నటించిందని.. ఈ క్రమంలో తాము వివాహం చేసుకుందామనుకున్నామని చెప్పారు. కానీ శ్రీవిద్య తల్లి తమ పెళ్లికి నిరాకరించడంతో తమ పెళ్లి ఆగిపోయిందని కమల్ అన్నారు. 
 
పెద్దల మాట కోసం ప్రేమను త్యాగం చేశామని.. తాము విడిపోయాక శ్రీ విద్య చాలా డిస్టబ్ అయ్యిందని కమల్ వెల్లడించారు. ఆ తర్వాత డైరక్టర్ జార్జ్ థామస్ డబ్బు కోసం శ్రీవిద్యను పెళ్లి చేసుకున్నారు. ఆపై ఆయనకు శ్రీ విద్య విడాకులు ఇచ్చింది. డబ్బు కోసం పెళ్లి చేసుకున్న విషయం తెలిసి.. మూడుసార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు సమాచారం. దీంతో ఆమె ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడింది. తర్వాత చెన్నై నుంచి తిరువనంతపురంలో స్థిరపడింది. 
 
అక్కడికి వెళ్లాక క్యాన్సర్ బారిన పడి మూడేళ్ల చికిత్స అనంతరం 2006లో ప్రాణాలు కోల్పోయింది... ఇలా శ్రీవిద్య గురించి కమల్ హాసన్ చెప్తూ భావోద్వేగానికి లోనైయ్యారు. అంతేగాకుండా కమల్ హాసన్‌ను ఆమె చివరి రోజుల్లో చూడాలనుకుంటే.. హీరో ఆమెను కలిసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.