సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జనవరి 2024 (17:51 IST)

ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రాజెక్ట్ #KH237కు దర్శకులుగా మాస్టర్స్ అన్బరివ్

Kamal Haasan,  masters unsbarive
Kamal Haasan, masters unsbarive
ఉలగనాయగన్ కమల్ హాసన్, ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్ లో  మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ 'థగ్ లైఫ్' చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237 కు సంబధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. #KH237కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బరివ్(అన్బుమణి, అరివుమణి) దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ.. 'ఇద్దరు ప్రతిభావంతులు, వారి కొత్త అవతార్‌లో #KH237 దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరివ్... రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌కి తిరిగి స్వాగతం' అని ట్వీట్ చేశారు.
 
 కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్  తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  బ్యానర్ పై  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.