సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (17:03 IST)

షారూక్ ఖాన్ డంకీ కోసం యు.ఎ.ఇ లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ

Shah Rukh Khan, Taapsee
Shah Rukh Khan, Taapsee
కింగ్ ఖాన్ షారూక్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డంకీ’. ప్రపంచ వ్యాాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచనాలను పెంచుతున్న ఈ మూవీ నుంచి డంకీ డ్రాప్ 4 అంటూ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీంతో అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కి చేరుకున్నాయి. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని అందరి హృదయాలను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరుని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేలా డంకీ సినిమా కోసం స్పెషల్ సాంగ్‌‌ను యు.ఎ.ఇలో చిత్రీకరించారంటున్నారు. మూవీ ప్రమోషన్స్ కోసం ఈ డాన్స్ నెంబర్ ను మేకర్స్ చిత్రీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
‘‘షారూక్, హిరాని కలిసి ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ వేశారు. దీని కోసం వారు మూడు రోజుల పాటు విలువైన సమయాన్ని కేటాయించారు. సుహానా సినిమా ప్రీమియర్ కోసం పాట చిత్రీకరణను పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి తిరిగి ఇండియా వచ్చేస్తారు. పరిమితమైన క్రూ సాయంతో అబుదాబి సరిహద్దు ప్రాంతాల్లో పాటను చిత్రీకరించారు. యు.ఎ.ఇలో షారూక్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు’’ అని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.