గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (12:20 IST)

ప్రభాస్ సాలార్ సినిమా విడుదలకు బ్రేక్ పడనుందా !

salar prabahs
salar prabahs
డిసెంబర్‌లో ప్రభాస్ నటించిన సాలార్ ట్రైలర్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ట్రైలర్ డిసెంబర్ రెండవ వారంలో.విడుదల కాబోతుంది. మూడో వారంలో అంటే డిసెంబర్ 22 న సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ, జనవరికి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
ఎందుకంటే షారుఖ్‌ ఖాన్‌ నటించిన ఢంకీ సినిమా డిసెంబర్ లో విడుదల కాబోతుంది. ఇందులో మల్టీసార్ కేస్టింగ్ వున్నారు. ఇప్పటికీ ఈ సినిమాపై క్రేజ్ వచ్చింది. సో.. బాలీవుడ్లో థియేటర్లు దొరక్కపోవచ్చని తెలుస్తోంది. ‘సాలార్‌’ సినిమా విడుదలను 2024కి వాయిదా వేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
గతంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'పఠాన్‌', 'జవాన్‌' చిత్రాల తర్వాత 'డుంకీ' బ్లాక్‌బస్టర్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఇటీవల 'రాధే శ్యామ్', 'ఆదిపురుష' చిత్రాలతో రెండు పరాజయాలను చవిచూశాడు.  ఏది ఏమైనా త్వరలో మేకర్స్ సలార్ పై అప్ డేట్ ఇవ్వాల్సిన పరిస్థి వచ్చింది. ఇక ప్రభాస్ తాజాగా  'కల్కి 2898 AD' సినిమా చేస్తున్నారు.