1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (11:20 IST)

హైదరాబాద్‌లో 200 అడుగులకు పైగా భారీ కటౌట్‌తో ప్రభాస్‌ పుట్టినరోజు వేడుకలు

Prabhas huge cutout
Prabhas huge cutout
రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న అనగా నేడు సోమవారంనాడు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఖైలతాపూర్‌ గ్రౌండ్స్‌లో 200 అడుగులకు పైగా భారీ కటౌట్‌ను అబిమానులు ఏర్పాటు చేశారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు రామకృష్ణరాజు ఆధ్వర్యంలో వేలాదిమందిగా హాజరయి వేడుకలను రంజింపజేశారు. గుంటూరుకు చెందిన శాస్త్రి, ఆల్‌ ఇండియా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు గోవింద్‌తోపాటు పలు పట్టణాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మిమిక్రీ, ప్రభాస్‌ సినిమాలోని పాటలు, డాన్స్‌లతోపాటు ప్రభాస్‌ జిందాబాద్‌ వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా సందడినెలకొంది.

Fans cake cutting
Fans cake cutting
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతి హీరోకూ ఫ్యాన్స్‌, సైన్యం వుంటారు. కానీ మన హీరోకు భక్తులున్నారు. ఇలా వుండడం పూర్వజన్న సుకృతం. ప్రభాస్‌ సినిమాల్లోకాదు. బయట కూడా హీరోనే అని తెలిపారు.

Prabhas fanxs sandai
Prabhas fanxs sandai
గుంటూరు శాస్త్రి మాట్లాడుతూ, సూర్యనారాయణరాజు, కృష్ణంరాజుగారి ఆశీస్సులు ప్రబాస్‌పై వుండాలని కోరుకుంటున్నాం. ప్రభాస్‌కు విజయాలు చేకూర్చి తిలకిస్తుండాలని ఆశిస్తున్నాం. ప్రభాస్‌ వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో ఎదిగినవ్యక్తి. కథ ఎంపికలో ఆయన కృషి చాలా వుంది. ప్రభాస్‌గారు ఫ్యాన్స్‌ కలవడంలేదని బాధపడవొద్దు.  అందరినీ కలుస్తారు. అభిమానుల కృషికి అందరినీ మంచి భవిష్యత్‌ వుంటుంది. అభిమాన సంఘాలు వారు కూడా భవిష్యత్‌ కార్యక్రమాలు అనేవి కుటుంబంపైనే వుండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు.

భీమరాజు మాట్లాడుతూ, రెండేళ్ళుగా ప్రభాస్‌ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాం. రెండు నెలలు ఆగితే బాక్స్‌ బద్దలయ్యే విజయం చూస్తామని అన్నారు.

అర్జున్‌ మాట్లాడుతూ, రాజులా గుండెల్లో పెట్టుకుని ప్రభాస్‌ వేడుకలు జరుపుకున్నాం. రొమాంటిక్‌, జానపదాలు, యాక్షన్‌ హీరోలు ఇండస్ట్రీలో వున్నారు. కానీ ఇవన్నీ చేయగల హీరో ప్రభాస్‌ ఒక్కడే అన్నారు. డిసెంబర్‌ 22న ఈ అభిమానాన్ని థియేటర్లలో దద్దరిల్లిపోయేట్లుగావ ఉండాలని గోవింద్‌ అన్నారు.