సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:30 IST)

ఫార్ములా - ఇ సిరీస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం

2024లో కూడా హైదరాబాద్ ఫార్ములా ఇ- సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫార్ములా వన్ 10వ సీజన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుంది. ఫార్ములా-ఇ సీఈఓ జెఫ్ డాడ్స్ హైదరాబాద్ మరియు షాంఘై సీజన్ 10 ఫార్ములా-ఇ రేస్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
 
2014 సెప్టెంబరు 13న బీజింగ్‌లో తొలి ఫార్ములా ఇ-రేస్‌ ప్రారంభమైందని.. ఇప్పటివరకు చైనా, భారత్‌, అమెరికా వంటి పలు అగ్ర దేశాల్లో ఫార్ములా ఇ-రేస్‌లు జరిగాయన్నారు.
 
సాన్యా, హాంకాంగ్ సహా చైనాలో ఇప్పటి వరకు ఏడు రేసులను నిర్వహించినట్లు వెల్లడించారు. ఫార్ములా-9 సీజన్లు వివిధ దేశాల్లో విజయవంతంగా పూర్తి కాగా ఇప్పుడు 10వ సీజన్‌ను తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
 
ఫార్ములా - ఈ సీజన్ 10 క్యాలెండర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు, జట్లు, అభిమానులు మరియు వీక్షకులను మరింత ఆకర్షిస్తుందని "ఫార్ములా - ఇ" పోటీల సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఛాంపియన్‌షిప్ ఆఫీసర్ అల్బెర్టో లాంగో అన్నారు
 
13-01-2024 – మెక్సికో సిటీ (మెక్సికో)
26-01-2024 – దిరియా (సౌదీ అరేబియా)
27-01-2024 – దిరియా (సౌదీ అరేబియా)
10-02-2024 – హైదరాబాద్ (భారతదేశం)
16-03-2024 – సావో పాలో (బ్రెజిల్)
30-03-2024 – టోక్యో (జపాన్)
13-04-2024 – టిబిడ్ (ఇటలీ)