బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (19:03 IST)

తల్లి కాబోతున్న తాప్సీ.. బిడ్డ కోసం కాళీమాతగానూ మారుతుందట!

Tapsee
తాప్సీ తన అప్‌కమింగ్ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపిస్తుందని అర్ధమవుతుంది. తల్లి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ఈ వీడియోతో హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది తాప్సీ. 
 
ఆపై కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో క్రేజీ సినిమాతో మన ముందుకు వస్తోంది ఈ బ్యూటీ. 
 
"తల్లి ఆశీర్వాదం బిడ్డకు ఎల్లప్పుడూ ఉంటుందని అందరూ అంటారు. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే.. ఆమె కాళీమాతగా మారుతుంది" అనే డైలాగ్ తో తాజాగా తాప్సీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 
 
ఈ వీడియో ద్వారా తాప్సీ తన తదుపరి సినిమాపై అంచనాలు పెంచేసిందని టాక్ వస్తోంది. గాంధారి పేరిట ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్‌ నాయిక కనికా థిల్లాన్‌ రచన, దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలకానుంది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్‌లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.