ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (15:44 IST)

ఎరుపు సల్వార్‌తో మథియాస్‌ను పెళ్లాడిన తాప్సీ.. వీడియో వైరల్

Taapsi
Taapsi
బాలీవుడ్ నటి తాప్సీ మార్చి 23న ఉదయపూర్‌లో చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట వారి వివాహానికి సంబంధించిన అధికారిక చిత్రాలను ఇంకా పంచుకోనప్పటికీ, వీరి పెళ్లి వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వచ్చింది.
 
వీడియోలో, తాప్సీ పెళ్లి వేడుకలో భాగంగా వరుడి వద్దకు వెళుతున్నప్పుడు ఆమె నృత్యం చేయడం చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక తాప్సీ వివాహం సన్నిహితుల మధ్య జరిగింది. తాప్సీ సాంప్రదాయ ఎరుపు సల్వార్ సూట్‌ను ధరించి కనిపించగా, మథియాస్ 'సెహ్రా'తో పూర్తి ఐవరీ షేర్వాణీని ధరించాడు.