పేద బాలికను కన్నెత్తికూడా చూడని కరీనా కపూర్.. నెటిజన్లు ఫైర్
పేద చిన్నారిని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పట్టించుకోకపోవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన.. కరీనా కపూర్‌కు పేద చిన్నారిని పట్టించుకోకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాళ్లు పట్టుకున్నా.. చూసీ చూడనట్లుగా వెళ్లిపోవడాన్ని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చి వద్ద చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కరీనా-సైఫ్ దంపతుల ముద్దుల కొడుకు తైమూర్ ఆలీ ఖాన్ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా మౌంట్ మేరీ చర్చీకి కరీనా వచ్చారు. ఈ సందర్భంగా కరీనాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు.
జనాల మధ్యలో నుంచి ఓ బిచ్చగాడి కూతురు కరీనా దగ్గరకు వచ్చింది. కాలు పట్టుకుంది. కానీ ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా కొడుకు తైమూర్‌ను ఎత్తుకుని ముందుకెళుతోంది. అక్కడనే ఓ మహిళా పోలీసు బాలికను పక్కకు తీసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బాలిక వైపు చూడకుండా కరీనా కపూర్ వెళ్ళిపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.