మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (18:08 IST)

కరీనా అనుమతిస్తే డేటింగ్‌కు వెళ్లాలనుంది... తాప్సీ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరైన సైఫ్, కరీనాల జంటకు పుట్టిన తైమూర్ అలీ ఖాన్ పుట్టుకతోనే సెలబ్రిటీగా మారిపోయాడు. ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు, ఫోటోగ్రాఫర్లు వెంటపడీ మరీ ఫోటోలు తీస్తున్నారు, ఇక ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతున్నాయి. 
 
తైమూర్ పాపులారిటీ ఏ రేంజ్‌లో ఉందంటే అతని ఆకారంతో బొమ్మలు కూడా మార్కెట్‌లోకి వచ్చాయి. ఇక తైమూర్ అభిమానుల జాబితాలో తాప్సీ కూడా చేరిపోయింది. తాజాగా ఆమె కరీనాకు చేసిన రిక్వెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
 
టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సొట్ట బుగ్గల అమ్మడు తాప్సీ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్‌తో కలిసి బద్లా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్లు, మీడియా సమావేశాలతో బిజీ బిజీగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మీరు ఎవరితో డేటింగ్ వెళ్లాలనుకుంటున్నారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు తాప్సీ ఇచ్చిన సమాధానం నవ్వు తెప్పించింది. నేను డేటింగ్‌కు వెళ్లాల్సి వస్తే ముందుగా కరీనా అనుమతివ్వాలి, ఎందుకంటే నేను వాళ్ల అబ్బాయి తైమూర్ అలీ ఖాన్‌తో డేటింగ్‌కు వెళ్తాను అని తాపీగా చెప్పి తప్పించుకుంది.