శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (11:43 IST)

''గని'' నుంచి లేటెస్ట్ అప్డేట్.. లెగ్స్ షేక్ చేయనున్న తమన్నా

''గని'' నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తెల్లపిల్ల సమంత స్టెప్పులేసేందుకు సిద్ధమైంది. వరుణ్ తేజ్ నుంచి కంప్లీట్‌గా కొత్త సబ్జెక్ట్ అందులోని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.
 
తాజాగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌కి గాను మేకర్స్ మిల్కీ బ్యూటీ తమన్నాని దింపినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధు ముద్ద, అల్లు బాబీలు నిర్మాణం వహించారు. ఇకపోతే.. అల్లుడు అదుర్స్ చిత్రంలో తొలిసారి స్పెషల్‌ సాంగ్‌ చేసింది తమన్నా. ఇందులో లబ్బర్‌ బొమ్మ పాటలో తన మాస్‌ స్టెప్పులతో ఉర్రూతలూగించింది.
 
అలాగే స్పీడున్నోడు చిత్రంలో మరోసారి బ్యాచ్‌లర్‌ బాబు బెల్లంకొండతో లెగ్‌ షేక్‌ చేసింది. వీటితోపాటు ఎన్టీఆర్‌తో జై లవకుశలో, నిఖిల్‌తో జాగ్వర్‌ చిత్రంలో, ఇంకా యష్‌తో కేజీఎఫ్‌: ఛాప్టర్‌-లో, మహేష్‌తో సరిలేరు నీకెవ్వరులో స్పెషల్‌ సాంగ్‌లతో ఓ ఊపు ఊపింది తమన్నా. తాజాగా గనిలో తమన్నా సాంగ్ చేయనుందని టాక్ వస్తోంది.