ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (12:15 IST)

తమన్నా భాటియా, రాశి ఖన్నాడాన్స్ ఎట్రాక్షన్ కోసమేనట

Tamannaah Bhatia   Raashi Khanna  dance
Tamannaah Bhatia Raashi Khanna dance
సినిమాను చూడడానికి దర్శకనిర్మాతలు చాలా జిమ్మిక్కులు చేస్తుంటారు. అందులో భాగంగానే తాజాగా బాక్ సినిమాలో తమన్నా భాటియా, రాశి ఖన్నా డాన్స్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మేము డాన్స్ చేశామే కానీ అది సినిమాలో వుండదు. కేవలం ప్రమోషనల్ సాంగ్ అంటూ తమన్నా భాటియా క్లారిటీ ఇచ్చింది. బాక్ సినిమాలో తామిద్దరమూ అస్సలు కలుసుకోం. కానీ ఎలాగైనా ఇద్దరి కాంబినేషన్ వుండాలని దర్శకుడి ఐడియానే ఇది అని తెలిపారు.
 
సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమాను తమిళంలో అరణ్మనై 4 తెలుగులో 'బాక్' పేరుతో వస్తోంది. ఖుష్బూ నిర్మాత. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్, జాన్వీ నారంగ్ విడుదల చేస్తున్నారు.   యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్- మే3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.