సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (07:15 IST)

తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన బాక్ సినిమా వాయిదా

Tamannaah Bhatia
Tamannaah Bhatia
సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బాక్' చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత సన్నాహాలు చేశారు మేకర్స్. అయితే ఎండల తీవ్రత అధికంగా వుండటం వలన విడుదల తేదిని వాయిదా వేస్తూ కొత్త తేదిని తెలియజేశారు. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.
 
Rashi Khanna
Rashi Khanna
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన  'పంచుకో' పాట అద్భుతమైన రెస్పాన్స్ తో చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్ ని విడుదల చేసి తెలుగు ప్రమోషన్స్ ని దూకుడుగా చేయబోతున్నారు మేకర్స్.    
 
అవ్నీ సినిమాక్స్  P Ltd పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
 
ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.