శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 11 జులై 2019 (20:05 IST)

తమన్నా ఎందుకు అలా చేసింది....?

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు. తమన్నాకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. హ్యాపీ డేస్ సినిమాతో సినిమా ఎంట్రీ ఇచ్చి యువ హీరోలతో పాటు, సీనియర్ హీరోలతోనూ నటించింది తమన్నా.
 
అయితే కొన్ని రోజులకు ముందు ముంబైలో 40 లక్షలు పెట్టి అపార్ట్మెంట్‌ను హడావిడిగా కొనుగోలు చేసింది తమన్నా. ముంబైలో ఇప్పటికే తమన్నాకు సొంత ఇల్లు ఉంది. అయితే ఉన్నట్లుండి ఇపుడు ఈ ఇల్లు కొనడం ఏమిటని స్నేహితులు ప్రశ్నించారు.
 
పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి కాలు పెట్టాలనుకుంటున్నావా అంటూ ఆట పట్టించారు. తమన్నా ఈ విషయాన్ని లైట్ తీసుకోవడంతో ఇది నిజమనే ప్రచారం ప్రారంభమైంది. గత వారం రోజులుగా ఫేస్బుక్, వాట్సప్‌లో ఈ ప్రచారమే జరగడంతో తమన్నా స్పందించింది. అదంతా అబద్ధమని అపార్ట్మెంట్ నచ్చి డబుల్ రేటు పెట్టి కొనుగోలు చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదంది తమన్నా.